బీసీలకు సాయం చేయని సీఎం మనకొద్దు : షర్మిల

బీసీలకు సాయం చేయని సీఎం మనకొద్దంటూ కేసీఆర్ పై మరోసారి వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. బీసీలంటే దొర మీటింగులకు మందిని తెచ్చేవారు, దొర గెలిచేందుకు ఓట్లేసే ఓటర్లు తప్ప బీసీలు దొరకు అక్కర లేదని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల. వాళ్ళ సంక్షేమం పట్టింపు లేదన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే దొరకు బీసీలకు లోన్లు ఇవ్వడానికి పైసలు ఉండవు.. బీసీ బిడ్డల ఫీజులు కట్టేందుకు పైసలు ఉండవని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

ఆత్మగౌరవ భవనాలు అనిముగ్గు పోసి వదిలేసి, మురిపించి వాడుకోవడం.. సంఘాల పేరుతో విభజించడం తప్ప .. బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్లకు సీట్లు కేటాయించకుండా వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్న సర్కార్ ఇది అంటూ కేసీఆర్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మి. బీసీల కనీస అవసరాలు తీర్చలేని చేతకాని_ముఖ్యమంత్రి_మనకొద్దంటూ కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.