
మేడిపల్లి: గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోడుప్పల్ కాకతీయ స్కూల్ వద్దనున్న ఫుట్ పాత్ పై ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బిక్షాటన చేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. ఒంటిపై బ్రౌన్ కలర్ బనియన్, నిక్కర్, తెల్ల జుట్టు గడ్డం ఉందని సంబంధీకులు ఎవరైన ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.