ఇటీవల హిజ్రాలపై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో షర్మిల క్షమాపణలు చెప్పాల్సిందేనని హిజ్రాలు.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. దీంతో దిగి వచ్చిన షర్మిల.. వారికి క్షమాపణలు చెప్పారు. తాను ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను తిట్టే.. సమయంలో.. అలా మాట్లాడనని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. రక్తం ఓడేలా చావ బాదుతారా? ప్రజల తరఫున ప్రశ్నిస్తే పాలకపక్షం ఇచ్చే బహుమతి ఇదేనా? సమాజానికి మీరు ఇస్తున్న సందేశం ఏంటి? ఇలాంటి రౌడీలు, గూండాలతో కేసీఆర్ దేశాన్ని ఏలుతారా? అని నిలదీశారు.
కాంగ్రెస్ యూత్ లీడర్ తోట పవన్ పై విచక్షణారహితంగా దాడి చేయడం క్రూరమైన చర్య. బీఆర్ఎస్ లీడర్లు మనుషులా? మృగాలా? పవన్ కోలుకోడానికి ఆరు నెలలు పడుతుందని డాక్టర్లు అంటున్నారు.ఆ తల్లి శాపం కేసీఆర్ కు తగులుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక, పరిపాలన చేతకాక, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక రౌడీల్లా దాడులకు ఎగబడుతున్నారన్నారు షర్మిల.