తెలంగాణ అప్పు రూ.7 లక్షల కోట్లు అయిందని…కాగ్ రిపోర్టు విడుదల చేసినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కకు మించిన అప్పులు చేసిందని… గడిచిన పదేండ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిందని కాగ్ రిపోర్టులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి అప్పులు, వడ్డీలు కట్టేందుకు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పడుతోందని కూడా చెబుతున్నారు.
2022–23 సంవత్సరానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదకలతో ఈ విషయం మరోసారి బట్టబయలైంది. గత ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్షన్నర కోట్లు మిత్తీ కట్టాల్సిన పరిస్థితి ఉందని కాగ్ వేలెత్తి చూపింది. ఆ ఏడాది చేసిన రూ.1,02,453 కోట్ల అప్పులకు రూ.1,64,565 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉందని కాగ్ ప్రస్తావించింది. గత ప్రభుత్వం అనుసరించిన ఆధ్వాన్నపు ఆర్థిక నిర్వహణ తీరుతో అప్పుల కిస్తీలు, వడ్డీలకు కలిపి పదేండ్లలో అంటే 2023–24 నుంచి 2032–33 వరకు రూ.2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పిందని కూడా ప్రచారం జరుగుతోంది..