సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతి పక్షం లో కూర్చో పెట్టారు. రేవంత్ సర్కార్ ఏమీ చేస్తామో చెప్పకుండా గత ప్రభుత్వం నీ విమర్శించడం పనిగా పెట్టుకుంది. విధ్వంసం, అప్పుల పాలు అయిన తెలంగాణ లో 31 వేల కోట్ల రుణమాఫీ ఎలా జరుగుతుంది.. లక్ష 50 వేల కోట్ల తో మూసి ప్రక్షాళన ఎలా అవుతుంది. అక్బరుద్దీన్ ఒవైసీ కి 300 కోట్లు ఎలా ఇస్తామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదో చెప్పమని అడిగితే చెప్పరు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే సినిమా చూసినట్టు చూస్తారు. బీజేపీ కి టైమ్ ఇవ్వమంటే ఇవ్వరు. అసెంబ్లీ లో బూతు పురాణం మాట్లాడుతున్నారు. అప్పుడే అప్పులు అంటాడు, అప్పుడే శంకుస్థాపనలు అంటాడు రేవంత్ రెడ్డీ.రిటైర్డ్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మంత్రుల పేషీలో 20 మంది ఉన్నారు.. తమ వాళ్ళను పెట్టుకుంటున్నారు.ప్రజాధనం వృధా అవుతుంది. ఒక్కో ఐఏఎస్ కు 8 డిపార్ట్ మెంట్ లు ఇస్తున్నారు. ఐఏఎస్ లు బదిలీ అయితే అయన తో పని చేసిన వారిని తీసుకొని పోతున్నారు. ఆంధ్ర కేడర్ కు చెందిన అధికారులను అడ్వైజర్ లుగా పెట్టుకున్నాడు సిఎం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.