టెలిగ్రాం యాప్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌.. ఇంత‌కీ టెలిగ్రాం ఏ దేశ యాప్‌..?

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న ప్రైవ‌సీ పాల‌సీ, ట‌ర్మ్స్ అండ్ కండిషన్స్‌ను మార్చ‌డంతో ప్ర‌స్తుతం ఆ యాప్ ప‌ట్ల విసుగు చెందుతున్న యూజ‌ర్లు పెద్ద ఎత్తున టెలిగ్రామ్ యాప్‌కు మారుతున్నారు. చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే టెలిగ్రామ్ యాప్‌ను ప్ర‌స్తుతం కొన్ని మిలియ‌న్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే కొంద‌రు మాత్రం టెలిగ్రామ్ యాప్ సేఫేనా ? ఇంతకీ ఆ యాప్ దేశానికి చెందుతుంది ? అది చైనా యాప్ అయి ఉంటుందా ? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అది చైనా యాప్ కాదు.

టెలిగ్రాం యాప్‌ను ర‌ష్యాకు చెందిన నికోలాయ్‌, ప‌వెల్ డురోవ్ అనే ఇద్ద‌రు సోద‌రులు డెవ‌ల‌ప్ చేశారు. 2013లో ఈ యాప్ ను తొలుత ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉంచారు. త‌రువాత ఏడాదికి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఈ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. అయితే మొద‌ట్లో ఈ యాప్‌ను జ‌ర్మ‌నీలోని బెర్లిన్ కేంద్రంగా నిర్వ‌హించేవారు. కానీ త‌రువాత అమెరికా, యూకేల‌కు చెందిన కంపెనీగా దీన్ని రిజిస్ట‌ర్ చేశారు. దీనికి ప్ర‌స్తుతం ప‌వెల్ డురోవ్ సీఈవోగా ఉన్నాడు.

ఇక టెలిగ్రాం యాప్ నిజంగా చెప్పాలంటే వాట్సాప్ క‌న్నా ఎంతో సుర‌క్షితం. వాట్సాప్‌లోలాగే ఇందులోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. ఇందులో ఉండే సీక్రెట్ చాట్ ఫీచ‌ర్ స‌హాయంతో చాట్ చేస్తే ఆ సంభాష‌ణ‌లు టెలిగ్రాం స‌ర్వ‌ర్ల‌లో స్టోర్ కావు. అందువ‌ల్ల పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక వాట్సాప్ క‌న్నా దీటైన ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. అందుక‌నే ప్ర‌స్తుతం చాలా మంది టెలిగ్రామ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version