తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్ కేసులో కీలక మలుపు..!

-

సంచ‌ల‌నం సృష్టించిన‌ తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు సిసిఎస్ పోలీసులు ఈ కేసును ద‌ర్యాప్తు చేశారు. అయితే ఇకపై కేసు విచారణ ఏసీబీ చేతికి వెళ్ల‌నుంది. క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి నిందితులు పాల్ప‌డిన‌ట్టు అధికారులు నిర్ధారించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ పీసీ యాక్ట్ కింద ఏసీబీ ఈ కేసును విచారిస్తోంది. 64.5కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లను నిందితులు మింగేశారు.

ఈ కేసులో వెంకటసాయి కుమార్ సహా 18మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఏఓ రమేష్ తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కూడా ఈ గోల్ మాల్ లో ఉన్న‌ట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్రపై సైతం ఉన్న‌ట్టు తేల‌డంతో ఏసీబీ విచారణకు ఈ కేసు వెళ్లింది. మొత్తం మూడు ఎఫ్ ఐఆర్ ల వివరాలను సీసీఎస్ అధికారులు ఏసీబీ కి అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news