టాలీవుడ్ హీరో లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. మా వల్లే హీరోలు అయ్యారు!

టాలీవుడ్ నటులపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప చిత్తూరు నెల్లూరు ఈ వరదల కారణంగా దెబ్బతిన్న నుండి అందరికి తెలిసిందేనని.. కానీ దీనిపై ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన హీరోలు ఎవరు స్పందించక పోవడం దారుణమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం వల్ల హీరోగా ఎదిగి.. కనీసం ఈ రోజు సహాయం చేద్దామని వారిని ఆదుకుంటామని.. హీరోలు ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. చిరంజీవి,నాగార్జున, మహేష్ బాబు, వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అల్లు అర్జున్, రాఘవేంద్రరావు గాని ఎవరు కానీ స్పందించలేదు.. కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదు.. పేపర్ లో గాని చానెల్స్ లో గాని స్పందించి ఉంటే బాగుండేదన్నారని పేర్కొన్నారు..

ఇప్పుడు పిలుపు ఇస్తున్నాం.. బయటికి రండి.. దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏదో ఒక సహాయం చేయమని ఈ హీరోలందరినీ కోరుతున్నామని స్పష్టం చేశారు… అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాతలు, డైరెక్టర్లు స్పందించాలని కోరుతున్నాము… ఇప్పుడున్న హీరోలను పాత రోజులు గుర్తు పెట్టుకోమని చెబుతున్నానని హెచ్చరించారు. పెద్దాయన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు గతంలో ప్రజలను అదుకున్నారని గుర్తు చేశారు. సినిమా ఇండస్ట్రీకి అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు రెండు కళ్ళు అన్నారు. తెలుగు ప్రజల వల్ల మీరు హీరోలయ్యారని.. మిమ్మల్ని హీరోలుగా చేసిన ప్రజలను  మర్చిపోయారని మండిపడ్డారు. ఇకనైనా ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నానన్నారు.