ఎట్టకేలకు మళ్లీ రష్మికకు తెలుగు హీరోనే ఛాన్స్ ఇచ్చాడుగా..!!

-

పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ మారి పోయిన విషయం తెలిసిందే. అక్కడి నుండి తాను దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. దానితో బాలీవుడ్ సినిమాలు కోసం సంతకం చేసింది. అక్కడకు వెళ్లిన తర్వాత రష్మిక లో అహం పెరిగిందని వార్తలు వచ్చాయి.గతంలో కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రష్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా ఆమె  సౌత్ ఇండియా మరియు బాలీవుడ్ మధ్య కంపేర్ చేసి సాంగ్స్ విషయం లో సౌత్ కు టేస్ట్ లేదని సౌత్ ను తక్కువ చేసేలా మాట్లాడింది.  అయినా కూడా  ఈమె చేసిన రెండు బాలీవుడ్ సినిమాలు రెండూ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దానితో మళ్లీ దిక్కు తోచని స్థితిలో మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమ వైపు తిప్పింది. ఇక ఆమె ఆశ నెరవేరి మళ్లీ తన పాత హీరో అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

రష్మిక కు ఆఫర్ ఇచ్చిన హీరో ఎవరో కాదు మన నితిన్ బాబు. భీష్మ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్.. రష్మిక మందన్నా మళ్లీ ఇద్దరూ జోడి కట్టనున్న ట్లు గా ప్రచారం జరుగుతోంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news