పది రూపాయల కాయిన్లని ఏ షాపుల్లో ఇచ్చిన తీసుకోవడం లేదు పైగా చాలా మంది పది రూపాయల కాయిన్స్ ఫేక్ అని అనడం మనం అనేకమార్లు వినే ఉంటాం. అటువంటి సమయంలో నిజంగా మనకి కష్టమవుతుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా..? ఒకవేళ ఎవరైనా వీటిని తీసుకోక పోయినట్లయితే అది లీగల్ ఆఫెన్స్.
మీరు వాళ్ళ మీద కంప్లైంట్ పెడితే వాళ్ళకి శిక్ష పడుతుంది. అలాంటి వాటి కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని కూడా చూడండి. ఎవరైతే పది రూపాయల కాయిన్స్ ని స్వీకరించరో వాళ్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు.
ఇండియన్ కరెన్సీ ఆక్ట్ మరియు ఐపిసి కింద వాళ్ల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా షాపు ఓనర్ లేదా పది రూపాయల కాయిన్స్ తీసుకోని వారు ఎవరైనా సరే వాళ్ల మీద శిక్ష తప్పక పడుతుంది. శిక్ష ఏమిటి అనే విషయానికి వస్తే… 489ఏ నుండి 489ఈ సెక్షన్స్ ఆధారంగా శిక్ష పడుతుంది.
నోట్స్ లేదా నాణేల ముద్రణను నకిలీ చేయడం, నకిలీ నోట్లు లేదా నాణేలను నడపడం మరియు సరైన నాణేలు తీసుకోవటానికి నిరాకరించడం నేరం. కనుక వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్లకి పెనాల్టీ పడచ్చు లేదా జైలు శిక్ష పడచ్చు లేదు అంటే రెండూ పడొచ్చు. అయితే సరైన ఎవిడెన్స్ ఉండాలి గమనించండి. ఆర్బీఐ కూడా పలు సార్లు ఈ నాణేలు ఫేక్ కాదు అని అనేక మార్లు వెల్లడించింది.