లండన్ లో 3000వేల మందితో…భారీ స్థాయిలో బతుకమ్మ..!!!

-

యూరప్ లోనే అతిపెద్ద బతుకమ్మ వేడుకలని తెలంగాణా ఎన్నారై ఫోరం నిర్వహించింది. లండన్ లో ఇప్పటి వరకూ ఒక తెలుగు పండుగని ఇంతటి భారీ స్థాయిలో జరపలేదని ఈ ఫోరం పేర్కొంది. ఈ కార్యక్రమానికి లండన్ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా ప్రజలు అందరూ హాజరయ్యారు. మొత్తం 3000 లమందికి పైగానే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నారపరాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

అంతేకాదు తెలంగాణా నుంచీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన జమ్మి చెట్టుకి పూజలు చేశారు.మూడు వేల మంది ఒకే చోట కూర్చుని పండుగని నిర్వహించుకునేలా భారీ వాటర్ ప్రూఫ్ టెంట్ వేసి అందులో బతుకమ్మపాటలు పాడుతూ చిన్నా పెద్దా సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరయిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రక్రుతి ని పూజించే పండుగని చేసుకోవడం తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతోందని అన్నారు.

 

ఇంతటి భారీ స్థాయిలో ఎక్కడా బతుకమ్మ నిర్వహించడం చూడలేదని నిర్వాహకులని అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారత రాయభారి మనమీత్ నారంగ్ మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా ఈ వేడుకలు నిర్వహించారని కొనియాడారు. TENF అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మని భారీస్థాయిలో నిర్వహించేదుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news