NTR స్టేడియం వద్ద ఉద్రిక్తత..బెటాలియన్ కానిస్టేబుళ్ల అరెస్టు!

-

తమ డిమాండ్లను నెరవేర్చాలని, తోటి కానిస్టేబుళ్ల విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని నినదిస్తూ ఎన్టీఆర్ స్టేడియం వైపు వస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్లు రాష్ట్ర పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేశారు. ఓకే పోలీస్.. ఓకే స్టేట్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను ఉన్నతాధికారులు కాళి కింద చెప్పులాగా చూస్తున్నారని, వెట్టిచారికి చేయిస్తున్నారని వారు వాపోతున్నారు.

కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని, 10 మందిని నేరుగా కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగం నుండి తీసివేసిందన్నారు.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 100 సార్లు ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పాడని, ఈ సందర్బంగా బాధిత కానిస్టేబుళ్లు గుర్తుచేశారు. ఇప్పుడు మమ్మల్ని కనీసం కలవడం లేదని కానిస్టేబుళ్లు ఒక్కసారిగా వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ మమ్మల్ని ఒకసారి పిలిచి తమతో చర్చలు జరగపాలని బెటాలియన్ కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news