జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. పార్టీ కార్యాలయం కిటికి అద్దాలు ధ్వంసం..!

-

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్  వైఎస్సార్ కడప జిల్లా మూడో రోజు పర్యటనలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో క్యాంపు ఆఫీసుకు వచ్చిన వారి నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో
ఉంటున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రోజు జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. తోపులాట జరగడంతో కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రజాదర్బార్ కార్యక్రమంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ తో పాటు, ఎంపీ అవినాశ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news