ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ స్టార్ట్ అయిపోయింది శంబుసరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. సరిహద్దుల దగ్గర మోహరించిన వేలాది మంది రైతులు ఈరోజు ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ ని ఉపయోగించారు దీంతో రైతులు భారీ ఎత్తున పొక్లెయినర్లు, బుల్ డోజర్లు, జెసిబి తో ముందుకు సాగుతున్నారు.
సరిహద్దులు దగ్గర 14,000 మంది రైతులు 12 ట్రాక్టర్లు అలానే 300 కార్లు 10 మినీ బస్సుల్లో వేచి ఉన్నారు. వీళ్ళని అడ్డుకోవడానికి హర్యానా ప్రభుత్వం వేలాది మంది పోలీసులు రంగంలోకి తీసుకువచ్చింది. కేంద్ర మంత్రులతో రైతు నేతలు చర్చలు జరిపి ఆందోళనకి రెండు రోజులు విరామం ప్రకటించిన నేపథ్యంలో రైతులు పంజాబ్ హర్యానా జాతీయ రహదారి మీద సరిహద్దుల దగ్గర వేల సంఖ్యలో ఉన్నారు.