బతుకమ్మల మీది నుంచి దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు !

-

టిఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళలంతా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడుతుండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు బతుకమ్మల మీదుగా దూసుకెళ్లడం తీవ్ర వివాదానికి దారి తీసింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు.

ఆ సమయంలో వేణుగోపాల స్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మను ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని… రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు చెప్పారు. అయితే దానికి మహిళలు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే మహిళలను తోసేసి.. బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారును పోనిచ్చాడు.

దీంతో మహిళలు అడ్డుకొని చల్లా ధర్మారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బతుకమ్మ ఆడుతున్న మహిళలను ఎమ్మెల్యే అగౌరవపరచారని.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్థానికులు. ఈ కార్డు ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో దళితులను అవమానించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇప్పుడు బతుకమ్మను కారు తొక్కించారు అని… ఆయనది కులాహంకారమని ఫైర్ అయ్యారు. దీనిపై ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news