బ్రేకింగ్‌ : తెలుగు అకాడమీ స్కాంలో రంగంలోకి ఈడీ

-

తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తెలుగు అకాడమీ స్కామ్‌ కేసులో త్వరలో ఈడీ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఈడి కి సమాచారం ఇచ్చారు సీసీఎస్ పోలీసులు. రూ.కోట్ల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు చేయనుంది ఈడీ..
తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5కోట్లు కొల్లగొట్టిన ముఠా… కాజేసిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసింది.

దీంతో మనీ లాండరింగ్‌ చట్టం కింద దర్యాప్తు చేయనుంది ఈడీ. హైదరాబాద్ ఓఆర్ఆర్ పక్కన 35ఎకరాల స్థలాన్ని వెంకట సాయి కుమార్ కొనుగోలు చేయగా… ఫ్లాట్లు కొనుగోలు చేశారు బ్యాంకు మేనేజర్లు మస్తాన్ వలీ, సాధన. అలాగే… సత్తుపల్లిలో బహుళ అంతస్థుల భవనం నిర్మిస్తు న్నాడు మరో నిందితులు వెంకటేశ్వర్ రెడ్డి. దీం తో ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులను గుర్తిం చనున్న ఈడీ.. తెలుగు అకాడమీ డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించి జప్తు చేయ నుంది.

Read more RELATED
Recommended to you

Latest news