టెన్షన్.. టెన్షన్.. తెలంగాణలో ఊపందుకున్న కరోనా కేసులు..

-

గత రెండేళ్లుగా ప్రజలను వణికించిన మహమ్మరి కరోనా ఇప్పుడు మరోసారి డేంజర్ బెల్ మోగిస్తుంది.వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైన కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండంతో జనాలు టెన్షన్ పడుతున్నారు.. తెలంగాణలో వరుసగా మూడో రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం 434 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 500లకు చేరువ కావడం టెన్షన్ పెట్టిస్తోంది.

గడిచిన 24 గంటల్లో 28వేల 865 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 315 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 102, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 126 మంది కరోనా నుంచి కోలుకున్నారు.అయితే ఇప్పటివరకు కరోనా కారణంగా ఒక్కరూ కూడా చనిపోలేదు..

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు..రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మాస్క్ తప్పనిసరి.. లేకుంటే ఫైన్ అని హెచ్చరిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news