వచ్చే సంవత్సరం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరగనుంది కదా. దాని కోసమే ఈ తిప్పలన్నీ. ఆ ప్రాంతమంతా ఇప్పుడు టెంట్ సిటీలతో కళకళలాడుతోంది. ఇంతకీ ఏంటి ఈ టెంట్ సిటీ అంటారా? టెంపరరీ లాడ్జ్ అన్నమాట. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తుల కోసం రూపొందించిన రూములు ఇవి. టెంట్లతో రూపొందించారు కాబట్టి.. దీన్ని టెంట్ సిటీ అని పిలుస్తున్నారు. టెంట్‌తో నిర్మించారు కదా అని.. సౌకర్యాలు అంతంత మాత్రమే కదా.. అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ టెంట్ సిటీలో అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక వసతులు ఉంటాయి. అంటే.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఎటువంటి సౌకర్యాలైతే ఉంటాయో.. ఇక్కడ కూడా అవే ఉంటాయన్నమాట. మొత్తం 4 వేల టెంట్ రూములు అందుబాటులో ఉన్నాయట. జనవరి 15 నుంచి అక్కడ కుంభమేళా ప్రారంభం కానుంది. టెంట్ సిటీలో రూమ్ కావాలనుకునేవాళ్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ప్రయాగ్‌రాజ్ కమిషనర్ ఆశిష్ గోయెల్ తెలిపారు.