పల్నాడు జిల్లా కారంపూడి లో కస్తూర్బా గాంధీ పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థిని ప్రియాంక భాయ్ కి అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని పరిష్కరించేది ఎవరు? అసలు తప్పు ఎవరిది..? స్కూల్ ప్రిన్సిపల్ తప్పా, ఎస్ఎస్సి బోర్డు యాజమాన్యం తప్పా. విద్యార్థిని ప్రియాంక పరీక్ష కేంద్రానికి వెళ్లి తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా ఇన్విజిలేటర్ హిందీ పేపర్ ఇవ్వడంతో ప్రియాంక అయోమయానికి గురైంది. తెలుగు పేపర్ కదా హిందీ పేపర్ ఇచ్చారని ఎంత మొత్తుకున్నా ఇన్విజిలేటర్ కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు.
ఏం చేయాలో తోచక అయోమయం స్థితిలో ఎగ్జామ్ హాల్ లో టైం ముగిసే దాకా కూర్చొని బోరున విలపించింది. హిందీ పేపర్ వచ్చింది కదా అదే రాయమని ఇన్విజిలేటర్ చెప్పడంతో విద్యార్థినికి ఏం చేయాలో తెలియక నిర్దాన్తపోయింది పరీక్ష తర్వాత విద్యార్థిని తల్లిదండ్రులకి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది ప్రియాంక హాల్ టికెట్ లో సైతం మొదటి లాంగ్వేజ్ గా హిందీ ఉండడం విశేషం కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ ని వివరణ అడగ్గా ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదని బోర్డులోనే పొరపాటు జరిగి ఉండవచ్చని అన్నారు