తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పదవ తరగతి పరీక్ష పేపర్లు. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే బయటికి వచ్చేసాయి.
9:30 గంటలకు ప్రారంభమైంది పదవ తరగతి పరీక్ష. పరీక్ష మొదలుకాగానే 9:37 గంటలకు పేపర్లు బయటకి వచ్చేసాయి. కొన్ని నిమిషాలలోనే పేపర్ బయటికి రావడం పై తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్న పేపర్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు, విద్యాశాఖ అధికారులు.