దేశంలో భారీగా ఉగ్రవాదులు…? ఆ మూడు రాష్ట్రాలు టార్గెట్…?

-

ఎన్నో ఏళ్ళ తరబడి పరిష్కారం కానీ సమయంల గత మూడు నెలలు కాలంగా సుప్రీం కోర్ట్, కేంద్రం పరిష్కరిస్తున్నాయి. ఏళ్ళ తరబడి వాదనలు వినిపించడం, వాటిని వాయిదాలు వేయడం, కొన్ని వర్గాలకు ఆ తీర్పులు నచ్చకపోవడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. ఆర్టికల్ 370 విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. అమిత్ షా పార్లమెంట్ వేదికగా బిల్లుని ప్రవేశ పెట్టారు. ఇక రాజకీయంగా ఇది బిజెపికి కలిసి వచ్చిందా లేదా అనే అంచనాలు వేస్తుండగానే సుప్రీం కోర్ట్ లో కీలక తీర్పు వచ్చింది.

ఎన్నో ఏళ్ళు గా సాగుతున్న అయోధ్య వివాదం విషయంలో సుప్రీం కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలంలో మందిరానికి అనుమతి ఇచ్చింది. దీనితో పాకిస్థాన్ కు చెందిన పలు ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు భారత్ ని లక్ష్యంగా చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారని నిఘా వర్గాలు కొంత కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా కూడా ఇలాంటి హెచ్చరికే చేశాయి నిఘా వర్గాలు. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న రెండు ఉగ్రవాద సంస్థలు దాడులు చేయడానికి సిద్దపడుతున్నాయని ఏ సమయంలో అయినా దాడులు చేయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రాన్ని హెచ్చరించాయి.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొంత కాలం క్రితం తమిళనాడులో ఉగ్రవాదులు హడావుడి చేశారు. వారిలో ముగ్గురు ఉగ్రవాదులు ఇప్పుడు కొందరి ద్వారా రద్దీ ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉందని, ఇందుకోసం కాశ్మీర్ నుంచి కూడా ఉగ్రవాదులు వచ్చారని భావిస్తున్నారు. దీనితో రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనంపై నిఘా ఉంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖకు నిఘా వర్గాలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news