హర్యానాలో ఉగ్ర కుట్ర భగ్నం…. ఆదిలాబాద్ తో సంబంధం

-

హర్యానాలో ఉగ్రకుట్ర భగ్నం చేశారు పోలీసులు. పాకిస్థాన్ ప్రమేయంతో దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రయత్నించేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారంతో బస్తారా టోల్ ప్లాజా సమీపంలో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ఫిరోజ్ పూర్ కు చెందిన వ్యక్తులు కాగా… ఒక్కరు లూథియానాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్ పర్మిందర్ మరియు భూపిందర్‌గా గుర్తించారు.

పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సహయంతో సరిహద్దులు దాటించి పంజాబ్ ఫిరోజ్ పూర్ లో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉగ్రవాదులు వదిలారు. గత 9 నెలలుగా దేశంలో వివిధ ప్రాంతాలకు పేలుడు పదార్థాలను తరలించినట్లు.. ఓ పాకిస్తానీ ఆదేశాల మేరకు నిందితులు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ కు మందుగుండు సామాగ్రీ, ఆయుధాలను చేరవేసినట్లు తెలిసింది. తాజాగా పట్టుబడిని ఆయుధాలను తెలంగాణ ఆదిలాబాద్ కు తరలిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version