విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా మరో ఘనత దక్కించుకోనుంది. అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా డిసెంబర్ 21న ఎస్&పీ 500 ఇండెక్స్‌లో చేరనుంది. సోమవారం నాటి మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) ఆధారంగా.. ఈ బెంచ్‌మార్క్‌లో చేరిన తర్వాత టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా నిలవనుంది.
సోమవారం కోవిడ్-19 లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ ఏర్పాటు చేసిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్.. నలుగురు అంతరిక్ష యాత్రికుల(ఆస్ట్రోనాట్స్)ను స్పేస్ స్టేషన్లోకి పంపినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క ఇండెక్సులో టెస్లా ఇంక్‌కు చోటు కల్పిస్తున్నట్లు ఎస్అండ్పీ-500 తాజాగా వెల్లడించింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద భారీగా బలపడటం విశేషం. ఇప్పుడు భారీ మార్కెట్ విలువ కలిగిన టెస్లా ఇంక్ ఎస్అండ్పీ-500 ఇండెక్సులో చేరడం ద్వారా యూఎస్ ఇండెక్స్ ఫండ్స్ పెట్టుబడి ప్రణాళికల్లో సవరణలు చోటుచేసుకోనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్అండ్పీ ఇండెక్సులో చేరడం ద్వారా టెస్లా ఇంక్ అధికారికంగా బ్లూచిప్‌గా మారనున్నట్లు తెలిపారు.