తెలంగాణ టెట్-2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో టెట్ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు టెట్ నిర్వహణ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. జూన్ 6 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
కాగా, డీఎస్సీ-2024 కంటే ముందుగానే టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ కమిషనర్‌కు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే వీలు కలగనుంది.11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషనన్ను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.