జై బాలయ్యను తొక్కి ముందుకెళ్తున్న బాస్?

-

సంక్రాంతి బరిలోకి రెండు పెద్ద హీరోల సినిమాలు పోటీపడనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాల నిర్మాతలు ఒక్కరే కావడం విశేషం. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ యే నిర్మిస్తున్నాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.

ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అంటే… అభిమానులు కోలహాలం అంతా ఇంతా కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ప్రచారం మొదలు పెట్టారు. రిలీజ్‌కు ముందే పైచేయి సాధించాల‌న్న ఉత్సాహం ఇద్దరు హీరోల అభిమానుల్లో ఉందనే చెప్పవచ్చు. అయితే ఇక తాజాగా ఈ రెండు సినిమాల ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యాయి. వాల్తేరు వీర‌య్య బాస్ పార్టీ, వీర‌సింహారెడ్డి జై బాల‌య్య సాంగ్ రిలీజ్ అయ్యాయి కానీ… రెండిటికి మ‌రీ అదిరిపోయేంత టాక్ అయితే లేదనే చెప్పవచ్చు. రెండింటికి ఎంతో కొంత కాపీ మ‌ర‌కలు అయితే అంటుకున్నాయి.

బాస్ పార్టీ సాంగ్ రాసింది.. పాడింది.. ట్యూన్ ఇచ్చింది దేవీ శ్రీ ప్రసాద్ యే. ప‌దాలు, ట్యూన్ ఏ మాత్రం క్యాచీగా లేవు. అప్పుడెప్పుడో శింబు న‌టించిన త‌మిళ సినిమా సిలంబాట్టన్ సినిమాలోని వేరీజ్ ద పార్టీ సాంగ్‌ను లేపేసిన‌ట్టుగా చెపుతున్నారు. అస‌లు దేవీ సాహిత్యం అయితే చాలా ఘోరంగా, పేల‌వంగా ఉందంటున్నారు. ట్యూన్ ప‌రంగాను, లిరిక‌ల్‌గాను రెండిట్లోనూ దేవీ ఫెయిల్ అయ్యాడు.

ఇక జై బాల‌య్య పాట కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. దానికి కూడా కాపీ మరక అంటుకుంది. మరోసారి తమన్… కాపీ ట్యూన్ చేశారంటూ… నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అప్పట్లో విజ‌య‌శాంతి నటించిన ఓసేయ్ రాముల‌మ్మ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్‌ను ఎత్తేసి తిర‌గ‌మోతేశాడ‌న్న విమ‌ర్సలు వ‌స్తున్నాయి. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ప‌దాలు ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నా అక్కడక్కడ పాత సాహిత్యాన్ని గుర్తు చేసిన‌ట్టుగానే ఉన్నాయి.

ఓవ‌రాల్‌గా రెండు సాంగ్‌లు కూడా మ‌రీ అంత హైప్ తెచ్చేలా లేవ‌న్నది నిజం. ఇక రెండో సింగిలైనా పాతపాటల వాస‌న‌లు, కాపీ మ‌ర‌కలు లేకుండా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ఉన్నంత‌లో దేవిశ్రీ రాసి, కంపోజ్ చేసిన ట్యూన్ కంటే జై బాల‌య్య సాంగ్ కాస్త విన‌డానికి అయినా బాగుంది. మాస్‌కు కాస్త జోష్ ఇచ్చేలా ఉంది. అదొక్కటే బాల‌య్య ఫ్యాన్స్‌కు కాస్త ఊర‌ట‌.

ఇక వ్యూస్ విషయానికి వస్తే… బాస్ పార్టీ సాంగ్ 24 గంటల్లో 9.51 మిలియన్ల వ్యూస్, 250.6కే లైక్స్ వచ్చాయి. అదే జై బాలయ్య పాట అయితే.. 7.00 మిలియన్ల వ్యూస్, 208K లైక్స్ వచ్చాయి. అంటే బాస్ పార్టీకే మంచి రెస్పాన్స్ వచ్చినట్టు. జై బాలయ్య పాటను జనాలు అంతగా పట్టించుకోనట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version