జబర్దస్త్ షోకి మళ్లీ వస్తామని మొర పెట్టుకుంటున్న కమిడియన్స్..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే చాలా కాలంగా జడ్జి గా వున్న నాగబాబు వెళ్ళిపోయారు.  రోజా కూడా ఇటీవల మంత్రి పదవి రావడంతో షో కు గుడ్ బై చెప్పింది.

ఇక కమిడియన్స్ చాలా మంది నాగబాబు తో జీ తెలుగు ఛానెల్ కు వెళ్ళి అదిరింది కామెడీ షో లో చేశారు. కొన్ని రోజులు అదరగొట్టిన షో తర్వాత చేతులు ఎత్తివేయడం చేసింది. దీనితో ఎలారా దేవుడా అంటున్న నేపథ్యంలో మళ్లీ స్టార్ మా టీవీ ఛానెల్ వారు కామిడీ స్టార్ లో అవకాశం ఇచ్చారు. ఇక ఈ షో ద్వారా రేటింగ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, ఏమైందో ఏమో తెలియదు కాని ఈ షో కూడా ఆగి పొయింది.

ఇప్పుడు ఈ కమిడియన్స్ పరిస్థితి దారుణంగా ఉందట. ఒక పక్క ఈఏమ్ఐ లు కట్టాల్సి రావడం, బ్యాంక్ లోన్లు, అప్పులు తీసుకుని ఉండడం తో ఎటూ పాలు పోవడం లేదట.దీనితో జబర్దస్త్ షోకి మళ్లీ వస్తామని మొర పెట్టుకుంటున్న గాని మల్లె మాల వాళ్ళు పట్టించుకోవడం లేదట. దీని గురించి ఒక ఎపిసోడ్ లో హైపర్ ఆది పంచ్ కూడా వేశాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్థస్త్ షో లో మాటీవి లో చమ్మక్ చంద్ర పక్కన ఫ్యామిలీ స్కిట్లు చేసిన శ్రీ సత్య  వచ్చి చేరింది. ఇక మిగిలిన వాళ్ళు కూడా తమను పిలుస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version