నిమ్మల-పితానిలకు వైసీపీ గాలం..?

-

పైకి 175కి 175 స్థానాలు గెలిచేయాలని జగన్ చెబుతున్నారు గాని..క్షేత్ర స్థాయిలో చూస్తే 175 కాదు కదా..నెక్స్ట్ అధికారంలోకి రావడానికి అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే చాలు అనే పరిస్తితి వైసీపీలో కనిపిస్తోంది. నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిస్తే గెలుపు కోసం వైసీపీ కష్టపడాల్సిందే.  ఆ విషయం వైసీపీ శ్రేణులకు బాగా అర్ధమవుతుంది. అందుకే ఇంకా తమ బలాన్ని పెంచుకునేలా ముందుకెళుతున్నారు. పైకి 175 అంటున్న..చాలా స్థానాల్లో వైసీపీ వీక్ గా ఉన్న సంగతి జగన్‌కు కూడా అవగాహన ఉంది.

ఆ స్థానాల్లో వైసీపీ బలాన్ని పెంచడానికి రకరకాల వ్యూహాలతో జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ చాలా వీక్ గా ఉన్న పాలకొల్లు స్థానంలో సరికొత్త స్కెచ్‌లతో ముందుకొస్తున్నారట. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు..నిత్యం ప్రజల్లో ఉండే నిమ్మల బలం తగ్గడం కాదు..ఇంకా పెరిగింది. ఈయనకు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. ఇక ఈయనకు చెక్ పెట్టే విషయంలో వైసీపీ విఫలమవుతుంది. ఇప్పటికే అభ్యర్ధులని మార్చింది.

ప్రస్తుతం అక్కడ కవురు శ్రీనివాస్ ఇంచార్జ్‌గా ఉన్నారు..ఆయన ఏ మాత్రం నిమ్మలకు పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఏకంగా నిమ్మలపైనే ఫోకస్ పెట్టిందట..ఆయన్నే వైసీపీలోకి తీసుకురావడానికి గాలం వేసిందని తెలిసింది. పైగా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ వైసీపీ ఆఫర్‌కు నిమ్మల మొహమాటం లేకుండా నో చెప్పేశారని తెలిసింది. ఎత్తిపరిస్తితుల్లోనూ టీడీపీని వదిలేది లేదని చెప్పారట.

దీంతో వైసీపీ..పక్కనే ఆచంటలో ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనాయరణపై గురి పెట్టారట. ఈయన గతంలో కాంగ్రెస్ లో పనిచేసి, తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రిగా పంచేశారు. గత ఎన్నికల్లో ఆచంట నుంచి ఓడిపోయారు. అయితే ఈయన సొంత ప్లేస్ పాలకొల్లు..దీంతో పితానిని వైసీపీలోకి తీసుకుని, పాలకొల్లులో నిలబెట్టాలని చూసారట. కానీ పితాని సైతం వైసీపీ వైపు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. ఇప్పటివరకు రెస్పాండ్ కూడా అవ్వలేదట. మొత్తానికి వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా లేవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version