పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం వకీల్ సాబ్. పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. హిందీలో భారీ హిట్ సాధించిన పింక్ సినిమాను తమిళ్‌లో నేర్కోండ పార్వైగా అజిత్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక తెలుగులోనూ బాక్సాఫీస్ లెక్కలు సరిచేసేందుకు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌గా రాబోతోన్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజున విడుదల చేసిన వకీల్ సాబ్ మొదటి పాట యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మగువా మగువా అంటూ రిలీజ్ చేసిన పాటకు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఈ పాటను రాసిన రామ జోగయ్య శాస్త్రికి ఎంతో మంచి పేరు వచ్చింది.
@ramjowrites JUS NAILED THE NEXT SONG OF #VakeelSaab sir ur form is now an #universalform pls keep continuing this god bless U . ♥️
Very inspiring & strong ??
What a blend ? @SVC_official #dilraju gaaru #venusriram gaaru ?????
Our #powerstar @PawanKalyan gaaru ???????— thaman S (@MusicThaman) March 16, 2020
మహిళల గొప్పతనాన్ని వర్ణించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మరో పాట కూడా రెడీ అయిందని, ఈ సారి కూడా రామ జోగయ్య శాస్త్రి అదిరిపోయే సాహిత్యాన్ని అందించాడని తమన్ ట్వీట్ చేశాడు. ఎంతో స్ఫూర్తినిచ్చే పాట అంటూ అంచనాలు పెంచేశాడు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.