అభిమానులందరికీ థాంక్స్ అంటూ..మహేష్ బాబు ట్వీట్

-

సర్కారు వారి పాట సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన అభిమానులందరికీ థాంక్స్ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.” మీరు చూపించే అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.. ఇంతటి గొప్ప సక్సెస్ సినిమాను అందించిన డైరెక్టర్ పరుశురాంకు బిగ్ థాంక్స్. థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. కీర్తి సురేష్, ప్రొడ్యూసర్స్ అందరికీ థాంక్స్. సర్కారు వారి పాట ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉండిపోతుంది.” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

కగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురాం పెట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం సర్కారు వారి పాట. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లేస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. పోస్ట్ పాండమిక్ తర్వాత సినీ పరిశ్రమలో సినిమాలకు ఆదరణ ఎలా ఉంటుందోనని అందరూ టెన్షన్ పడ్డారు. అయితే విడుదలైన చాలా సినిమాలు రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టడం విశేషం. ఆ కోవలో సర్కారు వారి పాట సినిమా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version