అదీ పవర్ స్టార్ రేంజ్ అంటే..20 రోజులకే రూ.80 కోట్లు..!

-

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయవసరం లేదు.. ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు రాజకీయాలలో కూడా చలాకీగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో మూడు చిత్రాలను ఆయన లైన్ లో పెట్టారు.. ఇకపోతే ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో ఉండగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ప్రముఖ నటుడు డైరెక్టర్ అయిన సముద్రఖని తమిళంలో నటించిన వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా రాబోతోంది.

ఇందులో సాయి ధరంతేజ్ , కేతికా శర్మ , ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే కేటాయిస్తున్నారని సమాచారం. అయితే ఈ 20 రోజులకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.80కోట్ల పారితోషకం డిమాండ్ చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

దీన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ రేంజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన ఈ లెక్కను చూసుకున్నట్లయితే.. రోజుకు రూ.4 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న జాబితాలో ముందుగా ప్రభాస్ ఉండగా, ఆ తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ ది కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news