జీవితంలో సంతోషంగా లేకపోవడానికి కారణం అదే.. కాజోల్..!!

-

కాజోల్.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్లలో ఈమె మొదటి స్థానంలో ఉంటుంది. తన అందంతోనే కాదు తన నటనతో , ముఖ కవళికలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ్ వంటి భాషా చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. గతంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజోల్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేసి మెప్పించిందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.నిజానికి అజయ్ దేవగన్ తో వివాహానికి కాజోల్ తండ్రి ఒప్పుకోకపోయినా.. మొండిగా ఉండడంతో కొన్ని రోజులకు ఆయనే ఒప్పుకున్నారు. ఇక అలా ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా అజయ్ – కాజోల్ ల పెళ్లి జరిగింది. ఇక వివాహం తర్వాత వీరు వెంటనే పిల్లలు కావాలనుకున్నప్పటికీ రెండుసార్లు మిస్ క్యారేజ్ అయిన విషయాన్ని తాజాగా కాజల్ బయట పెట్టింది. ఇకపోతే కాజల్ నటించిన కభీ ఖుషి కభీ గమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఇక అదే సమయంలోనే తాను ప్రెగ్నెంట్ గా ఉన్న కొన్నాళ్లకు మిస్ క్యారేజ్ అయిపోయింది అందుకే ఆ సమయంలో అసలు సంతోషంగా లేను అని తెలిపింది.Kajol: Ajay and I consciously chose to keep kids away from mediaఇకపోతే ప్రస్తుతం కాజోల్ – అజయ్ దేవగన్ కు నైసా దేవగన్ , యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే రెండు సార్లు అబార్షన్ అవడం వల్ల నిజంగానే ఆ మధుర జ్ఞాపకాలను ఆమె పొందలేకపోయానే అని బాధ ఒకవైపు..కభీ ఖుషి కభీ గమ్ సినిమా మంచి విజయాన్ని అందించినప్పటికీ ఆ సినిమా సమయంలోనే ఇలా అబార్షన్ అయింది అనే బాధ జీవితాంతం గుర్తుకు వస్తూ వెంటాడుతూనే ఉంటుందని చెప్పింది. కానీ ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ ఆ బాధ తనలో ఎప్పటికీ నిలిచిపోవుతుందంటూ కాజోల్ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది. ఏదిఏమైనా కాజోల్ త్వరగా ఆ బాధ నుంచి తేరుకొని తను జీవితాంతం సంతోషంగా ఉండాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news