ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో దళిత యువతిని కిడ్నాప్ చేసి సామూహికంగా కొంతమంది కామాంధులు అత్యాచారం చేసి అనంతరం దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అంటూ ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హత్రాస్ ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులు మరింత సంచలనం గా మారిపోయాయి.
అదే సమయంలో హత్రాస్ ఘటన బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు చేపట్టడం పై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం వ్యక్తం అయ్యాయి. అయితే ఈ విషయంపై ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్లారిటీ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలవకూడదు అన్న ఉద్దేశంతోనే అర్ధరాత్రి సమయంలో దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది అంటూ సుప్రీం కోర్టుకు తెలిపారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మరుసటి రోజు భారీ ఎత్తున శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తమకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందిన నేపథ్యంలోనే ఇలా అర్ధరాత్రి సమయంలో దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చారు.