గత తొమ్మిది నెలలుగా కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ బిక్కుబిక్కుమంంటూ గడిపాయి. ఇప్పుప్పుడే దాని ్రçపభావం కాస్త తగ్గుతుండటంతో ఊరట కల్గుతుందన్న సమయంలో బ్రిటన్‌లో బిజృంభిస్తున్న మరో కొత్తరకం వైరస్ మళ్లీ కంగారు పెడుతోంది. అయితే.. ఆ వైరస్‌తో ఎలాంటి భయం లేదని ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరమే లేదని శాస్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి( సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండె తెల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో తయారు చేసిన టీకా కొత్తరకం వైరస్‌ను ఎదుర్కుంటుందని పేర్కొన్నారు. ‘ఎన్501వై’ అనే కొత్తరకం వైరస్ ఇటీవల బ్రిటన్‌లో వేగంగా విస్తరిస్తుండటంతో దేశాలన్నీ అప్రమత్తమవుతున్న సంగతి అందరికీ తెలుసు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కన్నా ఈ కొత్తరకం వైరస్ మరింత ప్రమాకరం అనడానికి ఎలాంటి ఆధారాలే లేవని.. ఎవరూ అంతగా భయాందోళనకు గురి కావాల్సి అవరమే లేదన్నారు.
రెండిండికీ..
ఎన్501వైకు, కరోనా ఈ రెండింటి మధ్య యాంటీబాడీలతో పాటు మరికొన్ని విషయాల్లో తేడాలు ఉండే అవకాశం మెండుగా ఉంది. దీంతో కరోనా కోసం తయారు చేసిన టీకాలు దీనిపై ప్రభావం చూపేందుకు ఆస్కారం ఉంటుంది. దేశ సంస్థలు ఇప్పటికే కరోనా సంబంధించి విశ్లేశించిన దాదాపుగా 4 వేల జన్యురాశులలో కొత్తరకం వైరస్ మాత్రం వాటిలో కన్పించలేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి దాని మూలంగా ఎలాంటి భయం వద్దని మాండె స్పష్టం చేశారు.
గుర్తించవచ్చు..
ఆర్‌టీ, పీసీఆర్ పరీక్షలతో ఇటీవల వ్యాపిస్తున్న కొత్తరకం వైరస్‌ను గుర్తించవచ్చని మాండె అంటున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష సమర్థవంతంగా నిర్ధారిస్తుందా..? పలు అంశాలపై స్పష్టత అవసరమని.. ఈ పరీక్షతో కొత్త వైరస్‌ను గుర్తించలేమనడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేవని మాండె సూచించారు.