నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఘటన అది..అలీ..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడు ఆలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ.. కొత్తగా ఇంకొంతమంది కమెడియన్స్ వచ్చినా కూడా సీనియర్ కమెడియన్ ఆలీకి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తనదైన హావ భావాలతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. మొదటిసారి కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో ప్రెసిడెంట్ పేరమ్మ అనే సినిమా ద్వారా బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయమైన ఆలీ మొదటిసారి వెండితెరపై కనిపించారు. అలా ఎన్నో సినిమాలలో నటించి 1981లో వచ్చిన సీతాకోకచిలుక సినిమా ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో యమలీల సినిమాలో హీరోగా నటించి.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఆలీ .. ఈ సినిమాతోనే కమెడియన్ గా కూడా తన కెరియర్ కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత కాలంలో హాస్య నటుడిగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పటివరకు 1100 కు పైగా సినిమాలలో కమెడియన్ గా నటించారు. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ తన జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన గురించి వెల్లడించారు.. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీ జీవితంలో మర్చిపోలేని ఒక మరుపురాని సంఘటన గురించి చెప్పాలి అని అడగగా.. అలీ ఇలా సమాధానం చెప్పారు.

ఒకసారి దుబాయిలో ఫ్యామిలీతో కలిసి ట్యాక్సీ ఎక్కినప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ మీ పేరు అలీ కదా అని గుర్తుపట్టాడు. అతడు నేను హైదరాబాద్ వాసి అయి ఉంటాడు అని అనుకున్నాను.. కానీ టాక్సీ డ్రైవర్ ఆఫ్ఘనిస్తాన్ అని తెలియడంతో ఆశ్చర్యం కలిగింది . లోకల్ గా నన్ను అందరూ గుర్తుపడతారు కానీ విదేశాలలో కూడా నన్ను గుర్తుపట్టడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక ఈ ఘటన నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version