మీకు వారికి తేడా అదే..నటుడు ప్రకాశ్‌రాజ్‌ పరువు తీసిన తమిళ నిర్మాత!

-

నటుడు ప్రకాశ్ రాజ్ తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై వరుసగా ట్వీట్స్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్స్ చేయడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని ఎవరూ కించపరిచినా, హిందువుల మనోభావాలు దెబ్బతీసినా ఊరుకోనని పవన్ హెచ్చరించడంతో నాటి నుంచి వీరిద్దరి మధ్య ట్వీట్స్ వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడితే కొందరు సనాతన ధర్మం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేశారు ప్రకాశ్ రాజ్.

ఈ క్రమంలోనే తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ పక్కన కూర్చున ఫోటోను షేర్ చేసిన ప్రకాశ్ రాజ్‌కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీకు వారికి మధ్య ఉన్న తేడా.. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లిపోవడం వల్ల నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు’ అని ట్వీట్ చేయడంతో ప్రకాశ్ రాజ్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news