నేను ఫించ్ ని అందుకే అవుట్ చేయలేదు, నన్ను ఎందుకు అలా చూసాడు అసలు…: అశ్విన్

-

మన్కడింగ్ విషయంలో ప్రపంచ క్రికెట్ మొత్తం కూడా టీం ఇండియా సీనియర్ ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ ని నిందిస్తుంది. కాని అతను నేను చేసేది కరెక్ట్ అంటాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరుపున ఆడుతున్న అశ్విన్ అవకాశం వచ్చినా సరే మన్కడింగ్ చేయలేదు. దీనిపై చాలా వాదనలు వచ్చాయి. దీనికి అశ్విన్ క్లారిటీ ఇచ్చేసాడు.

“నేను ఆగి, రనౌట్ చేయాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను. నేను ఆలోచిస్తున్నప్పుడు కూడా అతను నన్ను చూస్తూనే ఉన్నాడు కాని… క్రీజులోకి రాలేదు. అతను ఎందుకు చూస్తున్నాడో నాకు తెలియదు. కానీ అతను పంజాబ్ తో ఆడిన రోజుల నుంచి కూడా మంచి స్నేహితుడు. అతను చాలా మంచి వ్యక్తి. చాలా సార్లు మేము సాయంత్రాలలో కలిసి కూర్చుని సమయం గడిపాం. కాబట్టి నేను దానిని చివరి హెచ్చరికగా వదిలేసాను అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version