ఫ్లైట్లో బిడ్డ జననం.. లైఫ్ టైమ్ ఫ్రీ టికెట్ ప్రకటించిన ఇండిగో..

-

ఢిల్లీ నుండి బెంగళూరు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళ మగబిడ్డకి జన్మనిచ్చింది. బుధవారం జరిగిన ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. ఈ మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారికంగా ప్రకటించింది. బిడ్డ ప్రసవానికి ఇండిగో ఎయిర్ లైన్స్ స్టాఫ్ అంతా సహకరించారని, ఐతే ఆ మహిళ నెలలు నిండకుండానే ప్రసవించిందని అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న ప్యాసెంజర్స్ సైతం బిడ్డ జననం గురించి మాట్లాడారు.

ప్రయాణీకులందరూ ఆ బిడ్డతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఐతే ప్రయాణంలో ఉండగా జన్మించిన బిడ్డకి జీవితాంతం ఫ్రీ టికెట్ ఇస్తున్నామంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. సాధారణంగా ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతుంటాయి. ఇలా నిజ జీవితంలో జరగడంతో విమాన ప్రయాణీకులందరూ ఎక్సైట్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version