అందుకే కెసిఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల ఫైర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి డబ్బులు దండుకోవటం తప్ప పాలనపై ధ్యాస లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పీర్జాదిగూడ పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్‌లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .

 

అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నా కూల్చివేయడం ఏంటని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి నియంతృత్వ పోకడలకు పోయే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని ,రెవెన్యూ మంత్రికి తెలియకుండానే అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

ప్రియ ఎన్ క్లేవ్‌లో ఇళ్లు నిర్మించుకున్న వారంతా చిన్నచిన్న ఉద్యోగులు, చిరువ్యాపారులు, పేదలే అని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఇవి అక్రమ భూములే అయితే జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ఎలా అనుమతులు ఇచ్చారని ,దీని వెనక రాజకీయకుట్ర దాగి ఉందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఇళ్లు నిర్మించుకున్న స్థలం ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రామ్ దాస్ గౌడ్ నుంచే బాధితులంతా కొనుగోలు చేశారని, పోచయ్య అనే కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతోనే వివాదానికి తెరతీశారని మండిపడ్డారు. భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదంటే కేసులు పెట్టి జైళ్లకు పంపాలని చూసిన గత బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news