అరుదైన రికార్డు సృష్టించిన ‘12th ఫెయిల్ మూవీ

-

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన చిత్రం’12th ఫెయిల్’. ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సొంతం చేసుకుంది.ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.గతేడాది అక్టోబర్ 27న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది.భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంది. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే… 12th ఫెయిల్ సినిమా ఇప్పటికే పలు పురస్కారాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డు సృష్టించింది. గడచిన 23 ఏళ్లలో థియేటర్లలో 25 వారాలు రన్ అయిన ఏకైక హిందీ సినిమాగా చరిత్రకెక్కింది. హీరో విక్రాంత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news