అయితే మోడీ.. లేకుంటే ఈడీ.. ఇదే బీజేపీ రాజకీయం : కేసిఆర్

-

బీజేపీ పై మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.అయితే మోడీ.. లేకుంటే ఈడీ.. ఇదే బీజేపీ రాజకీయం అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతానన్న బీజేపికి ఎందుకు ఓటు వెయ్యాలి? అని ప్రశ్నించారు.

మిషన్ భగీరథ పథకం ఐక్యరాజ్యసమితి మెచ్చిన పథకం అని12 రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడకు వచ్చి చూసి పోయిన పథకం.. ఇప్పుడు తాగు నీళ్లకు కొరత వచ్చి ట్యాంకర్లు వచ్చాయి, బోర్లు వేస్తున్నారు, ఇది ఎవరి తెలివి తక్కువతనమో మీరు గుర్తించాలి అని కోరారు.నిన్న ఒక కాంగ్రెస్ పెద్దమనిషి మాట్లాడుతూ మీ బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించి చూపియ్యండి అన్నాడు.ఇక్కడున్న బలహీనవర్గాల మేధావులకు , విద్యార్థులకు, ఉద్యోగులకు మనవి చేస్తున్నా. కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు, బీసీల అభివృద్ధికి మలుపు కాబట్టి కాసానిని గెలిపించండి .ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మేము ఏం చేయక పోయిన మాకే ఓటు వేశారు.. మేము ఏం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏం అనరు అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news