గ్లోబల్ స్టార్ కి డాక్టరేట్.. మెగాస్టార్ ఎమోషనల్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ట్రిపుల్ ఆర్ చిత్రం లో తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్‏ను కూడా ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్‏గా ఎన్నో అవార్డులు, రికార్డ్స్ అందుకున్న రామ్ చరణ్.. తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నారు.చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇవాళ ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లిన చరణ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఈ గౌరవం అందడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే… చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్టార్ రామ్చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై తండ్రి మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ‘ఒక తండ్రిగా నాకు గర్వంగా, ఎమోషనల్గా ఉంది అని అన్నారు.ఇదొక అద్భుతమైన క్షణం. బిడ్డలు గొప్ప విజయాన్ని సాధించినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. రామ్ చరణ్ నిలకడగా ముందుకెళ్తున్నాడు. లవ్ యూ డియర్ చరణ్’ అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news