శ్రీవారి భక్తులకు తీపి కబురు..

తిరుమల శ్రీ వారి భక్తులకు టీటీడీ ఆలయ కమిటీ తీపి కబురు అందించింది. అక్టోబర్‌ 1 వ తేదీ నుంచి అలిపిరి మార్గం ప్రారంభించాలని నిర్నయం తీసుకుంది. శ్రీ వారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్య లో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ.. కొండపైకి వెళుతుంటారు. అయితే… మరమ్మత్తులు మరియు ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం టీటీడీ అధికారులు మూసి వేశారు.

దీంతో ప్రస్తుతం శ్రీ వారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండ పైకి నడుచుకుంటూ వెళుతున్నారు. అయితే.. అక్టోబర్‌ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్నయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. ఈ నెల 13 నుంచి తిరుమలలో అగరబత్తీలు భక్తులకు అందుబాటు లోకి వస్తాయని.. చెప్పింది టీటీడీ. ఇక ఈ నెల 19 ను అనంతపద్మనాభ స్వామి వ్రతాన్ని పుష్కరిణి లో ఏకాంతం చక్రస్నానాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది తిరుమల తిరుపతి పాలక మండలి.