ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామని ప్రకటించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అర్హత ఉన్నవారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నామని… ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కొత్త రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదంటూ పలు చోట్ల ప్రజలు ఆందోళన చేస్తున్న తరుణంలో బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలంగాణ నీటిపారుదల, ఆహార అండ్ పౌరసరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అర్హత ఉన్నవారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం
ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి pic.twitter.com/c2UcG3lsJD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025