అంత్యోదయ స్కీం వారికి వర్తిస్తుంది : కేంద్ర మంత్రి

-

సామాన్య ప్రజలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రకటించింది. దీని వల్ల సామాన్య ప్రజలతో పాటు దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద రేషన్ బియ్యాన్ని పొందవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రతి నెల ఈ స్కీం ఆధారంగా సమీప రేషన్ షాపుల్లో బియ్యాన్ని పొందవచ్చు.

Ration
Ration

దివ్యాంగులకు రేషన్ పథకం ప్రయోజనాలు లభించడం లేదని గత కొన్ని నెలలుగా ఢిల్లీ హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అయితే ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అంత్యోదయ అన్న యోజన పథకాన్ని 2000 డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించారు.

ఈ స్కీం ఆధారంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు బియ్యం, గోధుమలు, పప్పులు, చక్కెర, ఫాం ఆయిల్ ఇతర సరుకులు అందిస్తోంది. అయితే ఈ స్కీంలో దివ్యాంగులను కూడా చేర్చాలని 2003లో నిర్ణయించినట్లు, కానీ పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు స్కీం ప్రయోజనాలు లభించకపోవడంతో నిలిపివేశామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించాడు.

ప్రస్తుతం అంత్యోదయ స్కీంను మళ్లీ ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం ప్రకటించారు. ఈ స్కీంలో సామాన్య ప్రజలతో పాటు దివ్యాంగులకు వర్తిస్తుందన్నారు. కాగా ఈ స్కీం కింద 35 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

రేషన్ పథకాలు అందడం లేదని ఢిల్లీ హైకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. దీంతో ఢిల్లీ హైకోర్టు సామాన్యులతో పాటు దివ్యాంగులకు రేషన్ సరుకులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దీంతో కేంద్ర మంత్రి ఈ అంత్యోదయ అన్న యోజన పథకంపై స్పష్టతనిచ్చారు. త్వరలో దివ్యాంగులను కూడా 35 కిలోల రేషన్ బియ్యాన్ని అమలు చేసున్నట్లు, పేదలందరికీ ఈ స్కీం వర్తిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news