గత కొద్ది రోజుల నుంచి నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంగలు పొంగి పోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వర్షాలు, వరదలు దేశవ్యాప్తంగా దాదాపు 998 కుంటుంబాలను ప్రభావితం చేశాయి. వివిధ ప్రమాదాల్లో మొత్తం 132 మంది నేపాలీలు ప్రాణాలు కోల్పోయారు. 128 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 53 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది.
Nepal: Flooding & landslide in parts of Nepal following heavy rainfall; visuals from Chitwan area.
132 people dead,128 injured, 53 missing&998 families affected due to rainfall, landslides&floods in the country as of 23rd July: Nepal Disaster Risk Reduction&Management Authority pic.twitter.com/X4yetUwBJW
— ANI (@ANI) July 24, 2020
ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. నేపాల్ డిజాస్టర్ రిస్కు రిడక్షన్ & మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సాయం అందిస్తున్నారు. క్షణక్షణం నరకం అన్న చందంగా ప్రజలు భయం గుప్పిట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఎదురైంది.