టీమిండియా ముందు భారీ టార్గెట్.. ఇక అంతా వారి చేతుల్లోనే ఉంది..!

-

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు తీవ్ర నిరాశ ఎదురైంది దాదాపు తొమ్మిది నెలల తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఓటమి చవి చూసింది భారత జట్టు. దీంతో రెండో మ్యాచ్ గెలవడం అనివార్యంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేడు జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో కూడా మరోసారి భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా జట్టు.

ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో భారత ఆటగాళ్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఏకంగా నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచింది ఆస్ట్రేలియా. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ఫించ్ అద్భుతంగా రాణించగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ ఏకంగా సెంచరీతో మెరిసాడు ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన మ్యాక్స్వెల్ మరోసారి అదరగొట్టి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ ముందు ఆస్ట్రేలియా భారీ స్కోరు ఉంచింది.

Read more RELATED
Recommended to you

Latest news