మనకి ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. వాటిలో ప్రత్యేకించి పిల్లల కోసం కూడా కొన్ని వున్నాయి. చాలా మంది పిల్లల చదువు కోసం, పెళ్లిళ్ల కోసం స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. అయితే మీరు కూడా ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? మీ పిల్లల కోసం ఏది మంచి స్కీమ్ అని చూస్తున్నారా..? అయితే ఇక్కడ కొన్ని స్కీమ్స్ వున్నాయి. వాటి వివరాల లోకి వెళితే…
సుకన్య సమృద్ధి యోజన:
పిల్లల కోసం మీరు డబ్బులని ఏదైనా స్కీమ్ లో పెట్టాలనుకుంటున్నారా..? అయితే సుకన్య సమృద్ధి యోజన బాగుంటుంది. ఆడపిల్ల పేరుపై మాత్రమే ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడానికి అవుతుంది. ఒక్కక్క ఆడపిల్ల పేరుపై ఒక ఖాతా చొప్పున ఒకరు గరిష్టంగా రెండు ఖాతాలను తెరవచ్చు. 8.1 శాతం వార్షిక వడ్డీ ప్రస్తుతం వస్తోంది.
రికరింగ్ డిపాజిట్ పథకం:
బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ తెరవచ్చు. ఇది కూడా పిల్లలకి మంచిది. రికరింగ్ డిపాజిట్లలో నెలకు 1000 రూపాయలు పొదుపు చేస్తే 5 ఏళ్లలో 75 వేల రూపాయల దాకా సంపాదించవచ్చు.
పిల్లల పేరిట బీమా పాలసీలు:
మీరు మీ పిల్లల పేర్ల మీద పాలసీలు కట్టవచ్చు. అప్పుడే పుట్టిన పసిపిల్లల పేర్ల మీద కూడా పాలసీలను తీసుకోచ్చు. పిల్లలకు 12 నుంచి 13 ఏళ్లు వచ్చే వరకూ ఈ పాలసీలను కొనసాగించవచ్చు. మనీ బ్యాక్ పాలసీ మరియు ఎండోమెంట్ వీటిలో రకాలు.
మ్యూచువల్ ఫండ్స్:
ఈక్విటీ ఫండ్స్‌లో అత్యధిక శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అధిక రిస్క్‌ను, అధిక రాబడిని కలిగి ఉంటాయి. రిస్క్ కూడా తగ్గుతుంది. ఇలా మీ పిల్లల కోసం ఇవి హెల్ప్ అవుతాయి.