ఐసియు వార్డ్ లో బాలుడి పుట్టిన రోజు…

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇక రోగులు అనుభవిస్తున్న నరకం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. ఇక బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు అనే చెప్పాలి. ఇది పక్కన పెడితే ఒక బాలుడు తాజాగా తన 9 వ పుట్టిన రోజుని ఐసియులో చేసుకున్నాడు. ఈ ఘటన యుఏఈలో జరిగింది.

యూఏఈలో తొమ్మిదేళ్ల హెర్వీ ఇమ్మాన్యూయేల్ మాగోస్ అనే బాలుడు మార్చి 22న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. పరిక్షలు చేయగా అతనికి పాజిటివ్ అని వచ్చింది. షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో నెల రోజుల పాటు అతనికి చికిత్స అందించారు. అయితే అతని పరిస్థితి విషమించడం తి ఐసియు కి మార్చి అక్కడ చికిత్స చేసారు. నెల రోజుల చికిత్స కు గానూ అతను కోలుకున్నాడు.

దీనితో సిబ్బంది చాలా జాగ్రత్తగా అతన్ని పంపించాడు. మాగోస్ ఏప్రిల్ 11న కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అప్పటి నుంచి సాధారణ వార్డులో వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీన అతని పుట్టిన రోజు కారణంతో వైద్యులు ఐసీయూ వార్డులోనే మాగోస్ పుట్టిన రోజుని చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news