సంచలన ప్రకటన చేసిన ట్రంప్, భారతీయులకు ఇబ్బందే…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయం దగ్గరకు రాగానే మరోసారి మెక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని మొదలుపెట్టారు. అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన మూడేళ్ళ నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ని సాకుగా చూపించి ఆయన ఇబ్బంది పెట్టడానికి సిద్దమయ్యారు.

ఇమ్మిగ్రేషన్ ని తాత్కాలికంగా రద్దు చేసిన ట్రంప్… ఇప్పుడు ఒక ప్రకటన చేసారు. అమెరికా రీ ఓపెన్ చేయగానే అమెరికన్లే ముందు కంపెనీల వద్ద ఉద్యోగాలకు నిలబడాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఎదురు చూడాల్సిందే అని, హెచ్1 బీ ఉన్న వాళ్ళు కూడా ఎదురు చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే హెచ్ 1 బీ వాళ్లకు వీసా పెంపు దరఖాస్తు గడువుని పెంచింది అమెరికా సర్కార్.

ఇప్పుడు ఎంత మంది భారతీయులను ఉద్యోగాల్లో నుంచి తీస్తారో తెలియదు. ఇక్కడ అప్పులు చేసి అక్కడ చదివి, ఇక్కడ వ్యాపారాలను అక్కడ ఉద్యోగాలు నమ్ముకుని పెట్టి ఎందరో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడటం ఖాయంగా కనపడుతుంది. ఇక ఓపెనింగ్స్ లో కూడా కంపెనీలు అక్కడి వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ట్రంప్ ఆలోచన అని అంటున్నారు. మరి ఇది అమలు లోకి వస్తుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news