జగన్ ఈ ప్రమాదాన్ని ఎప్పుడు గుర్తిస్తారో ?

-

ఏపీలో జగన్ పరిపాలన బ్రహ్మాండం గానే ఉన్నా, ఆయన పనితీరు పైన, ఆయన ముందు చూపు పైన జనాలు సంతృప్తిగా కనిపిస్తున్న, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. జగన్ ఒక్కో సందర్భంలో ముందుచూపుతో ముందుకు వెళ్లడం లేదు అని అర్థం అవుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్వం తానే అన్నట్టుగా జగన్ ముందుకు నడిపిస్తున్నారు. పార్టీలోను ప్రభుత్వంలోను తనకు ఎదురు లేకుండా చేసుకోగలుగుతున్నారు. అయితే పూర్తిగా ప్రభుత్వ పరిపాలన పై దృష్టి పెట్టడంతో పార్టీలో కొంత అసంతృప్తులు ఉన్నా, జగన్ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిజెపి జగన్ కు అన్ని రకాలుగానూ సహకరిస్తోంది.

ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు పలుకుతూ అన్ని రకాలుగానూ సహకారం అందిస్తోంది. అయితే బీజేపీతో ఎప్పటికైనా ముప్పు తప్పదు అనే అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ విషయాన్ని చూసుకుంటే అక్కడ మొదట్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బిజెపి అన్ని రకాలుగానూ సహకరించింది. ఇప్పుడు అక్కడ ప్రధాన రాజకీయ శత్రువుగా మారింది.అసలు తెలంగాణలో బలం అంతంత మాత్రమే అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బిజెపి తన ప్రతాపం చూపించింది. ఎవరు ఊహించని విధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ ను పూర్తిగా పక్కకునెట్టి బిజెపి టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన రాజకీయ శత్రువుగా మారిపోయింది. బలమైన ముందు చూపు తో రాజకీయ వ్యూహాలు పన్నడం లో దిట్టగా పేరు ఉన్న కెసిఆర్ సైతం ఇప్పుడు బిజెపి దూకుడుకి బెంబేలెత్తిపోతున్నారు.

గ్రేటర్ లో బిజెపి మేయర్ పీఠం సాధించేంత స్థాయికి వెళ్లి పోతుందేమో అన్న టెన్షన్ ఆ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఇక ఏపీలో వైసీపీ కంటే టిఆర్ఎస్ పార్టీ బలమైంది. జగన్ తో పోల్చి చూసుకున్నా, కెసిఆర్ రాజకీయ ఉద్దండుడు . అయినా బిజెపి దాటికి ఆయన నిలబడలేక పోతున్నారు. కానీ కెసిఆర్ అంత కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో జగన్ పెద్దగా పనితీరు కనబరచలేకపోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. తెలంగాణలో పెరిగిన ఇమేజ్ తో బిజెపి ఇప్పుడు ఏపీ పైనే దృష్టి పెట్టింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతుంది. అంటే అప్పటి నుంచే జగన్ కు రాజకీయ ప్రధాన శత్రువుగా మారబోతున్నాడు అనే సంకేతాలను ఇస్తోంది. ఈ విషయాలన్నీ జగన్ కు తెలిసినా, బీజేపీ ని శత్రువుగా చూసే విషయం లో ఎందుకో మొహమాటం పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news